పెట్రోల్ బంకులను పరిశీలిస్తున్న అధికారులు
ప్రజాశక్తి-చిలమత్తూరు పెట్రోల్ బంకుల్లో కొలతలు సక్రమంగా అమలు చేయడంతోపాటు కనీస వసతులైన మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలని సివిల్ సప్లరు డివిజినల్ ఎఎస్‌ఒ ప్రభావతి తెలిపారు. ఈమేరకు శుక్రవారం సివిల్ సప్లరు తూనికలు, కొలతల అధికారులు సంయుక్తంగా మండలంలోని రెండు పెట్రోల్ బంకులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిబంధనలు ప్రకారం కనీస వసతులు కల్పించాలన్నారు. కల్పించకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం లీగల్ మెట్రాలజీ ఇన్స్‌పెక్టర్ శివశంకర్, డిప్యూటీ తహశీల్దార్ హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.










