Feb 13,2023 19:53

నినాదాలు చేస్తున్న రిటైర్డ్‌ ఉద్యోగులు

నినాదాలు చేస్తున్న రిటైర్డ్‌ ఉద్యోగులు
కనీస పెన్షన్‌ రూ.9వేలు అందజేయాలి
-ఈపిఎప్‌ కార్యాలయం ఎదుట పెన్షనర్ల ధర్నా
నెల్లూరు:కనీస పెన్షన్‌గా రూ.9వేలు అందజేయాలని, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు ఏడాదికి రెండు సార్లు కరువు భత్యం అందజేస్తున్నట్లు తమకు అందజేయాలని ఏపిఆర్‌పిఏ ( ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డు పర్సన్స్‌ అసోసియేషన్‌) జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. సోమవారం నగరంలోని ఈపిఎప్‌ కార్యాలయం ఎదుట ఆ సంఘం ఆధ్వర్యంలో పెన్షనర్లు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ధర్నా కార్యక్రమం అనంతరం ఈపిఎప్‌ కార్యాలయ అధికారికి తమ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు
. ఈ సందర్భంగా ఏపిఆర్‌పిఏ జిల్లా కార్యదర్శి జి.చంద్రమౌళీ మాట్లాడుతూ సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు మేరకు అర్హులైన వారందరికీ హైయర్‌ పెన్షన్‌ మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటి సభ్యులు సిహెచ్‌ నాగభూషణం,కోవూరు షుగర్స్‌, నిప్పో పరిశ్రమల, సివిల్‌ స్లపయిస్‌, ఆర్‌టిసి, పలు రంగాలకు చెందిన పెన్షన్‌దారులు పాల్గొన్నారు.