Sep 28,2020 13:29

కందతో కమ్మగా... అట్టు

కావాల్సిన పదార్థాలు:
కంద - రెండు కప్పులు (చెక్కు తీసి ముక్కలుగా కోసుకోవాలి), శనగపప్పు - అర కప్పు, ఎండుమిర్చి - నాలుగు, జీలకర్ర - టీస్పూను, ఉప్పు, నూనె - తగినంత.
తయారుచేసే విధానం:
- శనగపప్పును అరగంటపాటు నీళ్లలో నానబెట్టాలి.
- కంద ముక్కలు మిక్సీలో వేసి, కొబ్బరి తురుములా కాస్త కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.
- కంద ముద్దను జల్లెడలో వేసి, నీళ్లన్నీ వడగట్టాలి. ఆ నీళ్లు పక్కనుంచుకోవాలి.
- నానబెట్టిన శనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పులను కలిపి బరకగా రుబ్బుకోవాలి.
- శనగపప్పు, కంద ముద్దలు రెండింటినీ కలుపుకోవాలి.
- పెనం మీద నూనె వేసి ఈ మిశ్రమాన్ని గరిటెతో దోశ వేసుకోవాలి.
- రెండోవైపు కూడా కాల్చుకున్నాక వేడిగా నెయ్యి, అన్నంతో వడ్డించాలి. ఇది అన్నంలోకి మంచి కాంబినేషన్‌.