Aug 19,2022 22:48

ప్రజాశక్తి-కలక్టరేట్‌
లక్షలాది మందికి ఉపాధి కల్పించే కల్లుగీత వత్తిపై ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్‌ కల్లుగీత కార్మిక సంఘం కష్ణా జిల్లా కార్యదర్శి వాకా రామచంద్రరావు డిమాండ్‌ చేశారు. సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక జ్యోతి రావు పూలే విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో రామచంద్రరావు మాట్లాడుతూ నాడు పాదయాత్ర సమయంలో జగన్‌ మోహన్‌ రెడ్డి గీత కార్మికులకు ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు చేయలేదన్నారు. అధికారంలో వచ్చిన 3 సంపపల కాలంలో గీతా కార్మికులను ఏ విధంగాను ఆదుకోలేదన్నారు. గీతన్నలకు ఉపాధి కలగాలంటే కల్లుగీత కార్పొరేషన్కు రూ.5 వేలకోట్లు నిధులు కేటాయించి, గీత కార్మికుల సంక్షేమ అభివద్ధికి ప్రత్యేక కషి చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే రకరకాల మద్యం బ్రాండ్లు ఉన్నట్లే ప్రకతిపానీయమైన కల్లుకు కూడా బ్రాండ్‌ ఇచ్చి గీత వత్తిని పరిశ్రమగా గుర్తించాలన్నారు. తాటి, ఈత చెట్లకు రక్షణ కల్పించి, వత్తిని ప్రోత్సాహిం చాలన్నారు. కల్లుకు మార్కెట్టు సౌకర్యం కల్పించి. చెట్లపై గీతకార్మికులకు గతంలో వలె హక్కు కల్పించాలన్నారు. రాష్ట్రంలో లక్షలాది గీత కుటుంబాలను ఆదుకునే విధంగా, ఎంతో ఘన చరిత్ర కలిగిన గీత వత్తిలో ఉపాధి - ఆధునీకరణకు అవకాశాలు కల్పించే విధంగా నూతన కల్లు విధానం రూపొందించాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. గీత కార్మికుల సమస్యల పరిష్కారం పై ఈ నెల 29 న విజయవాడ ఎంబివికె జరిగే రాష్ట్ర సదస్సురు సొసైటీల ప్రెసిడెంట్లు, గీత కార్మికులు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పరస శ్రీను, మురాల నరసిం హ స్వామి, రాజులపాటి గణేష్‌, పరస వెంకటేశ్వరరావు, ఈడే రామరావు,మారగాని నాగరాజు తదితరులు పాల్గొన్నారు.