కలక్టరేట్ (మచిలీపట్నం) : 76వ స్వాతంత్య్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా. కలెక్టర్ కార్యాలయంలో జెండా ఎగురవేశారు. అనంతరం మాతెలుగుతల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. కలెక్టర్ కార్యాలయాన్ని విద్యత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. ఈ సందర్భంగా కల్దార్ సి.రంజిత్ బాషా మాట్లాడుతూ హర్ ఘర్ తీరంగా కార్యక్రమంతో జిల్లాలోని ప్రతి ఇల్లు జాతీయ జెండాలతో రెపరెప లాడుతుందన్నారు. జాయింట్ కలెక్టర్ డా.మహేష్ కుమార్ రావిరాల, డిఆర్వో ఎం. వెంకటేశ్వర్లు కలెక్టర్ వెంట పాల్గొన్నారు. అలాగే జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారికా జెండా ను ఎగురవేశారు. జిల్లా పరిషత్ ఇంచార్జీ ముఖ్య కార్యనిర్వ హణాధికారి జి. శ్రీనివాసరావు ,జిల్లా పరిషత్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
అలాగే జిల్లా పోలీస్ కార్యాలయ అవరణలో జిల్లా ఎస్పీ జాషువా పోలీస్ అధికారుల, సిబ్బంది సమక్షంలో జాతీయ జెండాను ఆవిష్కరించి మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్వతంత్ర దినోత్సవ వేడుకల నుద్దేశించి మాట్లాడుతూ ఎందరో మహానుభావులు వారి ప్రాణాలను త్యాగం చేస్తే మనకి స్వతంత్రం లభించిందని, వారి స్ఫూర్తిని మనలో ఎల్లవేళలా నింపుకొని వారి అడుగుజాడల్లో నడవాలని కోరారు. అడిషనల్ ఎస్పీ (అడ్మిన్ )ఎన్ వెంకట రామాం జనేయులు , అడిషనల్ ఎస్పీ (స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో) అస్మా ఫరహిన్ , అడిషనల్ ఎస్పీ (ఏ ఆర్) ఎస్ వి డి ప్రసాద్ , డిఎస్పీలు, తదితరులు పాల్గొన్నారు.
ఆహుతులను అలరించిన సాంస్కతిక కార్యక్రమాలు
స్థానిక పోలీస్ పెరెట్ గ్రౌండ్స్లో నిర్వహించిన స్వాతంత్య్య్ర దినోత్సవ వేడుకల్లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు దేశభక్తి గేయాలకు నర్తించి బహు తుల్లో దేశభక్తి స్పూర్తిని రగిలింపచేశారు. చిన్నాపురం జిల్లాపరిషత్ హైస్కూల్, మచిలీపట్నం విద్యార్థులు స్లమ్ ఆర్ మిలీనీయర్ చిత్రంలోని జయహౌ.. దేశభక్తి గేయానికి ప్రదర్శించిన నత్యం ఆహుతులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. అదేవిధంగా మోపిదేవి మండలం, మోపిదేవి జిల్లాపరిషత్ హైస్కూలుకు చెందిన విద్యార్థులు దేశ్ రంగీలా.. దేశభక్తి గేయానికి, భట్ల జ్ఞానకోటయ్య జిల్లాపరిషత్ హైస్కూల్, ఫెడన విద్యార్థులు యే దేశ్ హై వీర్ జవానో కి .. గేయానికి, మాస్టర్ ఈకే బాలభాను, సుచిలీపట్నం విద్యార్థులు హిందుస్థానీ .. గేయానికి, శ్రీ బాలాజీ విద్యాలయం, మచిలీపట్నం విద్యార్థులు హర్ ఘర్ తిరంగా దేశభక్తి గేయాలకు వర్తించి ఆహుతుల్లో స్ఫూర్తిని నింపారు. ఈ వేడుకల్లో ఉత్తమ ప్రదర్శన కనబరచినందుకు అన్ని పాఠశాలల విద్యార్ధులను, ప్రధానోపాద్యాయులను మంత్రి, కలెక్టర్ ప్రశంసా పత్రాలతో అభినందించారు. ఈ వేడుకల్లో జడ్పి చైర్ పర్సన్ ఉప్పాల హారిక, మాజీ మంత్రివర్యులు, బందరు శాసన సభ్యులు పేర్ని వెంకట్రామయ్య(నాని), జాయింట్ కలెక్టర్ డా. మహేష్ కుమార్ రావిరాల,జిల్లా ఎస్పీ పి.జాషువా, నగర మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ కంటిపూడి కవిత, డిఆర్వో ఎం. వెంకటేశ్వర్లు, ఆర్ డి ఓ, ఐ.కిషోర్ పాల్గొన్నారు.
జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థ శాఖటానికి మొదటి బహుమతి
76వ స్వాతంత్య్య్ర దినోత్సవ వేడకల సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకటాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. సోమవారం స్థానిక పోలీస్ పెరెడ్ గ్రౌండ్స్లో 76వ స్వాతంత్య్య్ర దినోత్సవ జిల్లా స్థాయి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అభివద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ వివిధ శాఖలు శకటాలను ప్రదర్శించాయి. వీటిలో ఉత్తమ ప్రదర్శన కనబరచిన శకటాలకు రాష్ట్ర పర్యాటక, సాంస్కతిక, యువజన సంక్షేమ శాఖ మంత్రి, కష్ణాజిల్లా ఇన్చార్జి మంత్రి ఆర్.కె. రోజా, జిల్లా కలెక్టర్ సి.రంజిత్ బాషాతో కలసి బహుమతి ప్రధానోత్సవం చేశారు. జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థ శాఖటానికి మొదటి బహుమతి, సమగ్ర శిక్షా-పాఠశాల విద్యాశాఖ రెండవ స్థానం, మహిళాభివద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మూడవ స్థానం, గహనిర్మాణ సంస్థ మరియు ఏపీ టిడ్కో సంస్థ నాల్గవ స్థానంలో నిలచి బహుమతులను పొందాయి. ఈ సందర్భంగా ఉత్తమ ప్రదర్శన కనబరచిన శాఖాధికా రులను మంత్రి, జిల్లాకలెక్టర్ అభినందించారు.










