Sep 27,2023 11:49

ప్రజాశక్తి - యంత్రాంగం : పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, ట్రూ అప్ సర్దుబాటు, సర్ చార్జీ, అదనపు చార్జీలు పేరుతో ప్రజలపై భారాలు వేయటాన్ని వ్యతిరేకిస్తూ, ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్వ వద్ద ధర్నా కార్యక్రమంను చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ,  సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు ప్రసాద్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, డి రమాదేవి, సిపిఎం రాష్ట్ర కమిటీ నాయకులు డి.కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు. 

cpm-kvps-protest-on-forest-lands-in-kurnool
  • విద్యుత్ సంస్కరణలు ఉపసంహరించుకోవాలి : వామపక్ష పార్టీల నేతలు డిమాండ్

- పెరిగిన విద్యుత్ చార్జీలను తగ్గించాలి

కర్నూలు కలెక్టరేట్: కేంద్రం ప్రభుత్వం తీసుకుని వచ్చిన విద్యుత్ సంస్కరణలను వెంటనే ఉపసంహరించుకోవాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలన్నారు.పెంచిన కరెంటు చార్జీలను తగ్గించాలని వామపక్ష పార్టీలు సిపిఎం సిపిఐ సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ ఎస్యుసిఐ పార్టీలు ఆధ్వర్యంలో ధర్నా బుధవారం చేపట్టారు. సిపిఐ నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి సిపిఎం నగర కార్యదర్శి రాముడు అధ్యక్షత జరిగిన ధర్నాలు సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌసే దేశాయి రాష్ట్ర కమిటీ సభ్యులు పి నిర్మల సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు మల్లికార్జున ఎస్ యుసిఐ జిల్లా నాయకులు నాగన్నలు  పాల్గొని  మాట్లాడుతూ  రాష్ట్రంలో  వైఎస్ జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ట్రూ ఆఫ్ చార్జీలు సర్ చార్జీలు ఇంధనం సర్దుబాటు చార్జీలు కస్టమర్ చార్జీలు ఫిక్స్డ్ చార్జీలు విద్యుత్ సుంకం లాంటి వివిధ రకాల పేర్లతో చార్జీలను పెంచారన్నారు. నాలుగున్నర సంవత్సర కాలంలో విద్యుత్ చార్జీలను విపరీతంగా పెంచి పెద్ద ఎత్తున బారాలు మోపిందని దీని కారణంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. స్మార్ట్ మీటర్ల పేరుతో వ్యవసాయ రంగానికి రైతులకు ఇచ్చేస్తున్నటువంటి ఉచిత విద్యుత్తును యధావిధిగా కొనసాగించాలన్నారు.  వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కొనసాగించాలన్నారు. గతంలో వాడుకున్న కరెంటుకు తదుపరి భారం వేసే విధానాన్ని రద్దు చేయాలన్నారు.ఎస్సీ ఎస్టీలకు వృత్తిదారులకు ఎక్కడ నివసిస్తున్న 200 యూనిట్ల వరకు ఉచిత రాయితీ ఇవ్వాలన్నారు.  200 యూనిట్లు లోపు వాడే పేదలందరికీ ఉచిత విద్యుత్ అందించాలన్నారు. ఈ ధర్నా లో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాయకులు పి యస్.రాధాకృష్ణ , కెవి.నారాయణ జిల్లా నాయకులు ఆనంద్ బాబు, గురు శేఖర్ సియచ్.సాయిబాబా, కె.సుదాకరప్ప, అర్.నరసిహులు. యం.విజయ్, అబ్దుల్ దేశాయ్, షరీఫ్, రామక్రీష్ణ, కె.ప్రభార్, మహ్మద్ రఫీ, నోమేశ్వరీ, బాస్కర్, శంకర్, మైముద్.సిపిఐ  నాయకులుకే జగన్నాథం, శ్రీనివాసరావు మహేష్ , బిసన్న నాగరాజు గిడ్డమ్మ అమ్మినాభి తదితరులు పాల్గొన్నారు

cpm-kvps-protest-on-forest-lands-in-raychoti
  • ప్రజలపై విద్యుత్ భారం తగ్గించాలి  : సిపిఎం

అన్నమయ్య-రాజంపేట అర్బన్ :  ప్రజలపై విద్యుత్ భారం తగ్గించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సి.హెచ్ చంద్రశేఖర్, చిట్వేలి రవికుమార్, పందికాళ్ళ మణి లు డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం ఆర్డిఓ కార్యాలయం వద్ద విద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగా ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా చంద్రశేఖర్, రవికుమార్, మణి మాట్లాడుతూ ఫిక్స్డ్ చార్జీలు, ట్రూ అప్ చార్జీలు, కస్టమర్ చార్జీలు, విద్యుత్ డ్యూటీ చార్జీలు, ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారని అన్నారు. దళితులకు విద్యుత్ సబ్సిడీ 200 నుంచి 300 యూనిట్లకు పెంచాలని, ఈ సబ్సిడీ దళిత గ్రామాలలోనే కాక పట్టణ పరిధిలో కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్ల ఆలోచన విరమించుకోవాలని, వ్యవసాయ బోర్లకు మీటర్లు ఏర్పాటు చేసే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలపై మోపిన విద్యుత్తు భారాలను వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు. ఈ మేరకు ఏ.ఓ జ్ఞానేశ్వరికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జయరాం, ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షులు రమణ, జాన్ ప్రసాద్, కే.వి.పీ.ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంచలయ్య, నందకుమార్, పెనగలూరు మండలం సిపిఎం కార్యదర్శి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

 

left-parties-protest-against-power-charges-in-tirupati

 

  • పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి : వామపక్షాలు డిమాండ్:

తిరుపతి : గూడూరులో బుధవారం రోజు పెంచిన విద్యుత్ చార్జీలు ట్రూ ఆఫ్ చార్జీలు ను వెంటనే తగ్గించాలని, రాష్ట్ర కమిటి ఇచ్చిన పిలుపుమేరకు గూడూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట సి.పి.ఎం. సి.పి.ఐ. వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. నాయకులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. 200 యూనిట్లు వరకు ఉచితమని  చెప్పి అధికారoలోకి రాగానే, నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు నమ్మక ద్రోహం చేయడం జరిగిందని. అంతే కాకూండా వివిధ రూపాలలో విద్యుత్ భారాలు మోపిందని, చార్సీలు సెంపు, ట్రూ ఆఫ్ చార్జీలు, సర్దు బాటు చార్జీలు, నిధ్యుత్ సుoకం ఫిక్స్ డ్ చార్జీలు, కష్టమర్ చార్జీలు,    అదనపు డిపాజిట్లు పేరుతో ప్రజలను నిలువ దోపిడీకి గురి చేస్తూ ఉన్నారని ఓటు వేసిన పాపానికి, ప్రతి ఓటరు, వినియోగదారుడుకి, బాదుడు మీద బాదుడు వేస్తున్నారని, వ్యవసాయానికి, పంపు సెట్లుకి మీటర్లు బిగించి సబ్సిడీలను ఎత్తివేయాలని చూస్తున్నారని, ఈ పద్ధతిని నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సెంటర్ శాఖ కార్యదర్శి జోగి శివకుమార్, ఎస్.సురేష్, అడపాల ప్రసాద్, పుట్టా శంకరయ్య, ఎంబేటి. చంద్రయ్య, జి.మదు,బి.చంద్రయ్య,బి. నారాయణ, కె.దనమ్మ,యశోదమ్మ, లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

vzm-left-parties-protest-against-power-charges
  • రాష్ట్ర ప్రజలపై విద్యుత బారాలు రద్ధు చేయాలి : వామ పక్షాల డిమాండ్

విజయనగరం టౌన్ : రాష్ట్ర ప్రజలపై వేసిన విద్యుత్ చార్జీలు భారాలు తక్షణమే ఉపసంహరించుకోవాలని, వామ పక్షాలు నాయకులు డిమాండ్ చేశారు. విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా బుధవారం కలెక్టరేట్ వద్ద వామపక్షాల ధర్నా నిర్వహించారు.ధర్నాను ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లాకార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఓమ్మి రమణ, సీపీఐ ఎం ఎల్ జిల్లా నాయకులు బెహరా శంకర్రరావులు మాట్లాడుతూ  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలు ఫలితంగా రోజు రోజుకి విద్యుత్ ధరలు పెరుగుతూ పేద మధ్యతరగతి , పేద ప్రజానీకానికి ఆర్దిక ఇబ్బందులకు కారణమవుతున్నాయని అన్నారు. ఇప్పటికే ప్రజలు పెరిగిన ధరలతో శతమతమవుతుంటే ఇవి చాలదన్నట్లు మూలుగుతున్న నక్క పైన తాటిపండు పడినట్లు విద్యుత్ చార్జీలను కూడా పెంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నడ్డి విరుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగినధరలు తగ్గించాలని, విద్యుత్ ప్రైవేటీకరణ ఆపాలని, ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో విద్యుత్ చార్జీలు భారాలు పెంపు ఆపాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలుపై నిర్వహించే  ప్రజా ఉద్యమాలు పై నిర్బంధాన్ని ఆపాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటి సభ్యులు పీ.రమణమ్మ, జగన్ మోహన్ సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేశ్ , నగర కార్యదర్శి బి.రమణ, ఏ ఐ ఎస్ ఎఫ్ నాయకులు, అప్పన్న, ,కేసిపిస్ జిల్లా కార్యదర్శి అనoద్, పట్టణ పౌర సంక్షేమ సంఘం అధ్యక్షుడు త్రినాథ్, సిపిఎం రైతు, వ్యవసాయ కార్మిక సంఘం,సీపీఎం ఎం ఎల్ నాయకులు రెడ్డి నారాయణరావు, అప్పలరాజు వామ పక్షాలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

kakinada-left-parties-protest-against-power-charges3
  • అసభ్య పదజాలంతా రెచ్చిపోయిన డి.ఎస్.పి

కాకినాడ కార్పొరేషన్ : నా కొడకల్లారా.. ఎవర్రా మీరంతా  ఎక్కించండి రా బళ్ళు.. ఏం చేస్తారో చూస్తా  అంటూ కాకినాడ డిఎస్పి మురళీకృష్ణ రెడ్డి సిపిఎం నాయకులపై విరుచుకుపడ్డారు. మహిళలను చూడకుండా ఇష్టం వచ్చినట్లు సిపిఎం నాయకులను బూతులతో రెచ్చిపోయాడు .విద్యుత్ ఛార్జీలపై శాంతియుతంగా తలపెట్టిన సిపిఎం నిరసన కార్యక్రమం డి.ఎస్.పి రాకతో ఉద్రిక్తంగా మారింది. 

kakinada-left-parties-protest-against-power-charges3
  • విశాఖలో వినూత్న నిరసన 

విశాఖ : పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని కోరుతూ వామపక్ష పార్టీలు ఆధ్వర్యంలో గురుద్వారా దగ్గర కరెంట్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం సిపిఎం నాయకులు ఎం జగ్గ నాయుడు, ఆర్కే ఎస్, వి కుమార్, ఎం సుబ్బారావు, వై రాజు, ఐద్వా నాయకులు బి పద్మ, కుమారి, సిపిఐ నాయకులు  రాజు, మహేష్, తదితరులు పాల్గొన్నారు.