Feb 14,2023 21:34

ఫొటో : అవగాహన ర్యాలీ చేపడుతున్న దృశ్యం

కేన్సర్‌ నివారణపై సైకిల్‌ ర్యాలీ
ప్రజాశక్తి-ఉదయగిరి : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా గండిపాలెం ఆయుష్మాన్‌ భారత్‌ - హెల్త్‌ వెల్నెస్‌ ఆరోగ్య సిబ్బంది కేన్సర్‌ నివారణకు సైకిల్‌ తొక్కడం వల్ల కలిగే ప్రయోజనాలు ప్రజలకు అవగాహన కలిగించడానికి సైకిల్‌ ర్యాలీని నిర్వహించారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ హైస్కూల్‌ నుండి బస్టాండ్‌ సెంటర్‌ వరకు గండిపాలెం ప్రాథమిక ఆరోగ్య విద్యాధికారి కె.వెంకట సుబ్బయ్య ర్యాలీలో పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రతిరోజు సైకిల్‌ తొక్కుట వల్ల కేన్సర్‌ నివారణకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయని ఆరోగ్యకరమైన శరీర బరువు ఒత్తిడిని తగ్గించుకోవడం రక్తపోటును నివారించడానికి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండటానికి సుఖ నిద్రకు అధిక కేలరీలు తగ్గుముఖంతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. అదేవిధంగా ప్రతినెలా 14న ఆరోగ్య విషయాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
మానసిక ప్రశాంతత కోసం హెల్త్‌ వెల్నెస్‌ సెంటర్‌లో యోగా, మెడిటేషన్‌ నిర్వహిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గౌస్‌బాషా, ఎంపిహెచ్‌ఎస్‌ టివి ఎంఎల్‌హెచ్‌పి బి.వెంకటేశ్వర్లు నాగార్జున, రామారావు, ఎంపిహెచ్‌ఎఎస్‌ జి.శ్రీనివాసులు రబ్బాని, ఎఎన్‌ఎంలు స్వాతి, నూర్జహాన్‌, ఆశా కార్యకర్తలు శ్రీదేవి, లక్ష్మి, అంకమ్మ, సలోమ్‌, విద్యార్థులు పాల్గొన్నారు.