Jan 27,2023 17:37
  • క్రీడల ద్వారా ఉజ్వల భవిష్యత్తు : మేయర్ విజయలక్ష్మి

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : కంచెర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు రోజులు పాటు జరగనున్న ఖోఖో, కబ్బడ్డీ రాష్ట్ర పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం స్థానిక రాజీవ్ క్రీడా ప్రాంగణంలో ప్రారంభమైన పోటీలను మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డెప్యూటీ మేయర్ రేవతి దేవి,కంచెర్ల ఫౌండేషన్ సభ్యులు కె.కుమార్ ప్రారంబించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ క్రీడలు ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. విజయనగరంలో కస్పా స్కూల్లో చదివి,క్రీడాకారుడు రాణించి అమెరికాలో స్థిరపడి క్రీడలను ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చి రాష్ట్ర పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. విజయనగరంలో క్రీడలు ప్రోత్సాహానికి ,నగరాభివృద్ధికి కంచెర్ల ఫౌండేషన్ సహరించాలని కోరారు. అనంతరం కంచెర్ల ఫౌండేషన్ సభ్యులు కె.కుమార్ మాట్లాడుతూ తాను కస్పా స్కూల్లో చదివి ఖో ఖో ఆడి తర్వాత ఉన్నత చదువులు చదివి అమెరికాలో స్థిరపడటం జరిగిందన్నారు. చదువుకున్న ఊరికి, క్రీడా పాఠాలు నేర్పిన ఊరిలో క్రీడలను ప్రోత్సహించేందుకు ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు. క్రీడలు ఆడుతున్న క్రీడాకారులు జీవితంలో స్థిరపడే విధంగా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే క్రీడా పోటీలు నిర్వహించేందుకు ఎల్లప్పుడూ సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో డెప్యూటీ మేయర్ రెవతిదేవి, కార్పొరేటర్ ఎస్ వి వి రాజేష్,వైసిపి నగర అధ్యక్షులు ఆశపు వేణు, తవిటిరాజు, ఖో ఖో అసోసియేషన్ చైర్మన్ చిన్నం నాయుడు,కబ్బడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కాళ్ళ సూరిబాబు, చీప్ కోచ్ అప్పలనాయుడు, ఖో ఖో అసోసియేషన్ కార్యదర్శి సత్యన్నారాయణ, కబ్బడ్డీ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పతివాడ.శ్రీనివాసరావు, వ్యాయమ ఉపాద్యాయులు గోపాల్, బొమ్మన రామారావు, వ్యాయమ ఉపాద్యాయులు 8 జిల్లాల నుంచి ఖో ఖో,కబ్బడ్డీ క్రీడాకారులు పాల్గొన్నారు.