నియామకపత్రం అందజేస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-నెల్లూరు :నగర పాలక సంస్థలో విధులు నిర్వహిస్తూ మతి చెందిన వారి కుటుంబ సభ్యులకు జీవన భద్రత కల్పించే దిశగా కమిషనర్ వికాస్ మర్మత్, మంగళవారం కారుణ్య నియామకాల్లో భాగంగా నగర పాలక సంస్థ పబ్లిక్ హెల్త్ విభాగంలో పబ్లిక్ హెల్త్ వర్కర్‌గా విధులు నిర్వహిస్తూ మృతిచెందిన తాళ్ళూరి కుమారమ్మ కుమారుడు ఇలారి జాన్సన్ బాబు కు కార్పొరేషన్ హెల్త్ విభాగంలో క్లీనర్ గా బాధ్యతలు కల్పిస్తూ కమిషనర్ కారుణ్య నియామక ఉత్తర్వులను అందించారు. విధి నిర్వహణలో అనునిత్యం బాధ్యతాయుతంగా వ్యవ హరించాలని కమిషనర్ సూచించారు.










