ప్రతిభా విద్యార్థిని గజలక్ష్మికి స్వీట్ తినిపిస్తున్న దృశ్యం
ప్రజాశక్తి - బుక్కపట్నం : కార్డియాలజీ కోర్స్‌లో గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థిని గజలక్ష్మి అత్యున్నత ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిచి తన ప్రత్యేకతను చాటుకుంది. మండల పరిధిలోని జానకంపల్లికి చెందిన నాగార్జున శాంతమ్మ దంపతుల కుమార్తె గజలక్ష్మి సత్య సాయి ఇన్యుస్టూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ టెక్నాలజీ బెంగళూరు కళాశాలలో బీఎస్సీ కార్డియాకేర్ టెక్నాలజీ విద్యను అభ్యసిస్తోంది. 2023 సంవత్సరంలో నిర్వహించిన పరీక్షలలో ప్రథమ స్థానం సాధించి పలువురు విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది. ఈ సందర్భంగా విద్యార్థిని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు సాయిబాబా స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని తెలిపారు.










