Sep 27,2023 10:31

ప్రజాశక్తి-బాపట్ల : బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం పల్లెకోన గ్రామానికి చెందిన పురమా గోపరాజు (25) అనే ఆర్మీ జవాన్( లాంచ్ నాయక్ ) రాజస్థాన్ జస్సాత్మిన్ లో విధులు నిర్వహిస్తుండగా మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. ఈయన పార్థివ దేహాన్ని  ఆర్మీ సిబ్బంది ప్రభుత్వ లాంఛనాలతో స్వగ్రామానికి తరలిస్తున్నారు. బుధవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న మృతదేహానికి తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్లు నివాళులర్పించిన అనంతరం, మధ్యాహ్నానికి తల్లిదండ్రులకు అప్పగించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పార్థివ దేహం స్వగ్రామానికి చేరుకున్న అనంతరం  మంత్రి మెరుగు నాగార్జున, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావులు కూడా నివాళులర్పిస్తారని అన్నారు. కాగా గోపరాజు మృతి పట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.