Feb 12,2023 22:10

272వ రోజు ప్రజాబాటలో కేతంరెడ్డి వినోద్‌రెడ్డి

ప్రజాశక్తి -నెల్లూరు ప్రతినిధి :జనసేనలో ఇద్దరు నేతల మధ్య జగడం బయట పడింది. ఓ కేసు విషయంలో ఎఫ్‌ఐఆర్‌ బుక్‌ కావ డంతో ఆదే అదునుగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్‌రెడ్డి నగర అధ్యక్షలు కేతంరెడ్డి వినోద్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు ఓ ప్రకటన విడు దలైయింది. దీంతో ఒక్కసారిగా జనసేనలో ఏం జరుగు తుందోననే కార్యకర్తలు, నాయకుల్లో అలజడి మొదలైయింది. జనసేన పార్టీకి కేతంరెడ్డి వినోద్‌రెడ్డి బ్రాండ్‌గా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో నెల్లూరు నగరం నుంచి అభ్యర్థిగా పోటీచేశారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌తోనూ మంచి సంబంధాలున్నాయి. రాష్ట్రంలో ఏ జనసేన నాయకులు, కార్యకర్తలు చేయని కార్యక్రమం చేస్తూ అధినేత దృష్టిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చేయాలని ప్రవనన్న ప్రజాబాట పేరుతో ప్రజల్లో తిరుగుతున్నారు. ఎడతెరుప లేకుండా 272 రోజుల నుంచి కార్యక్రమం చేస్తున్నారు. రాష్ట్రంలోని ఆపార్టీ నేతలు, కార్యకర్తలకు ఈ కార్యక్రమం ఉత్సహం నింపుతోంది. ఆర్థిక భారమైన పవన్‌కళ్యాణ్‌ దృష్టిలో పడడంతోపాటు, పార్టీలో కొంత జోష్‌ నింపుతున్నారు. గత ఎన్నికల్లో మనుక్రాంత్‌రెడ్డి నెల్లూరు రూరల్‌ అభ్యర్థిగా పోటీచేశారు. ఆయన పేరుకు జిల్లా అధ్యక్షలుగా ఉన్నప్పటికీ పార్టీని నెల్లూరు నగర నియోజ కవర్గంలో ప్రజల్లోకి తీసుకుపోవడంతో వినోద్‌రెడ్డి గట్టిగా పనిచేస్తున్నారు. ఇలాంటి సమ యంలో పార్టీలో జరిగిన చిన్నపాటి వివాదాన్ని జరిగింది. కేసులు పెట్టుకున్నారు. దీనిని సాకుగా చూపించి, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని, పార్టీలో గట్టిగా పనిచేస్తున్నారని చెబుతోన్న వినోద్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నాని ప్రకటించడంతో ఆపార్టీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. తమ నేత పై చర్యలు తీసుకునే అధికారం అధినేత పవన్‌కళ్యాణ్‌, నాదేంళ్ల మనోహర్‌లకుకు ఉందని, మనుక్రాంత్‌ ఎవరు అని వినోద్‌రెడ్డి గ్రూపునకు చెందిన నేతలంటున్నారు. వినోద్‌రెడ్డి ఇవేవీ పట్టించుకోకుండా ఆదివారం 47వ డివిజన్‌లో పవనన్న ప్రజాబాట నిర్వహించారు. తమ కార్యక్రమం చివరి వరకు జరుగుతుందని చెప్పారు. దీంతో జనసేనలో జగడం ముదిరింది. నాయకులు, కార్యకర్తల్లో అమోయమం నెలకుంది. ఆపార్టీ అధిష్టానం రంగంలోకి దిగితేనే ఈ సమస్యకు పరిష్కారం దొరికేలా ఉంది.