Feb 12,2023 22:12

ఫొటో : సభ్యత నమోదు చేపడుతున్న జనసేన నేతలు

జనసేన సభ్యత్వ నమోదు
ప్రజాశక్తి-అల్లూరు : మండల కేంద్ర స్థానిక ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ వద్ద ఆదివారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో 3వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్‌ కారుమంచి కార్తీక్‌శర్మ మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందన్నారు. పార్టీ అధినేత కార్యకర్తల కోసం ఎంతో శ్రమిస్తున్నానని తెలిపారు.
కార్యకర్తలు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు అలాగే ఏదైనా హాస్పిటల్లో వైద్యం పొందేందుకు రూ.10 వేల నుండి రూ.50 వేల వరకు ఆర్థికసాయం అందిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో నాని, సుబ్రహ్మణ్యం, శ్రీకాంత్‌, రవి తదితరులున్నారు.