Sep 16,2023 21:58

ఫొటో : మాట్లాడుతున్న ఎంపిడిఒ ఐజాక్‌ప్రవీణ్‌

జగనన్న ఆరోగ్య సురక్ష
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపిడిఒ ఐజాక్‌ప్రవీణ్‌ తెలిపారు. శనివారం మండలంలోని రావులకొల్లు గ్రామంలో వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో జరుగుతున్న ఇంటింటా సర్వే కార్యక్రమాన్ని ఎంపిడిఒ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది ప్రతి గృహాన్ని సందర్శించాలని, ప్రభుత్వం సూచించిన విధంగా అవసరమైన పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. అదేవిధంగా వలంటీర్లు చెర్లోయడవల్లి సచివాలయ పరిధిలో 30వ తేదీన జరుగునున్న జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు గురించి కూడా అందరికీ తెలియజేయాలని సూచించారు.
ఏడు రకాలైన టెస్టులు నిర్వహించడానికి కిట్స్‌ అందుబాటులో ఉన్నాయని వాటిని ఉపయోగించుకొని అవసరమైన ప్రతిఒక్కరికీ టెస్టులు నిర్వహించాలని వైద్య అధికారిణిని, సిబ్బందిని కోరారు. కార్యక్రమంలో మహిమలూరు వైద్యాధికారిణి డాక్టర్‌ అనూష, ఇఒపిఆర్‌డి ఉషారాణి, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.