Jan 23,2021 19:29

హైదరాబాద్‌: బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చంచల్‌గూడ జైలు నుండి శనివారం విడుదలయ్యారు. ఆమెకు సికింద్రాబాద్‌ న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ను శుక్రవారం మంజూరు చేసిన విషయం విధితమే. శనివారం ఆమె జైలు నుండి విడుదలయ్యారు. జైలు వద్ద అఖిలప్రియ బంధువులు, ఆళ్లగడ్డ, నంద్యాల నుండి అనుచరులు తరలివచ్చారు. దీంతో ఆ పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. ఆమె భర్త భార్గవ్‌రామ్‌ ముందస్తు బెయిల్‌ను కోర్టు తిరస్కరించిన విషయం విధితమే. బోయినపల్లి పోలీస్‌స్టేషన్‌లో 15 రోజులకొకకసారి ఆమె సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఈమేరకు న్యాయమూర్తి ఆదేశించారు.