ఇసుక మాఫియాకు అడ్డగా కోవూరు
ప్రజాశక్తి కొడవలూరు : కోవూరు నియోజకవర్గాన్ని ఇసుక, గ్రావెల్ మాఫియా అడ్డగా ఎంఎల్‌ఎ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మారుస్తున్నారని మాజీ ఎంఎల్‌ఎ పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విమర్శించారు. ఆదివారం మండలంలోని నార్త్ రాజుపాలెం పిఎస్‌ఆర్ కళ్యాణ మండపంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంఎల్‌ఎ పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గం ఇప్పటికే ఇసుక, గ్రావెల్ మాఫియా అడ్డగా మారిపోతుంటే జిల్లా కలెక్టర్ కోవూరు నియోజకవర్గంలో ఇసుక రీచ్‌లు కొన్ని పర్మిషన్ ఇవ్వడాన్ని ఎద్దేవా చేశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రజల్లో అసంతృప్తి కలిగిస్తుందని, కార్యక్రమం అధ్వానంగా తయారయిందని, గడప గడప కార్యక్రమంలో సమస్యలపై ఎంఎల్‌ఎను ప్రజలకు అడిగితే రావాల్సిన ప్రభుత్వం నుంచి పథకాలని ఆపేయమని అధికారులకు చెప్పడంతో ప్రజల్లో అసంతృప్తి కలుగుతుందని తెలిపారు. మద్యం మాఫియాలో ఎంఎల్‌ఎకి భాగస్వామ్యం లేదా అని ప్రశ్నించారు. మొట్టమొదటిసారిగా నియోజకవర్గంలో ఎంఎల్‌ఎ ప్రసన్న నాయకత్వంలో గంజాయి తీసుకువచ్చారన్నారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు కోటంరెడ్డి అమరేంద్ర రెడ్డి, ఎంపిటిసి గరికిపాటి రాజేంద్ర, కరకటి మల్లికార్జున, చెక్క మదన్మోహన్ చెముకుల చైతన్య కృష్ణ, బుజ్జి రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.










