Apr 17,2023 22:47
  • చెన్నై సూపర్‌కింగ్స్‌ 226/6

బెంగళూరు: స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటర్లు దంచి కొట్టారు. దాంతో, ఆర్సీబీ ముందు 227 పరుగుల టార్గెట్‌ పెట్టింది. ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే(83), శివం దూబే (52) అర్ధ శతకాలతో చెలరేగారు. చివర్లో మోయిన్‌ అలీ(19), రవీంద్ర జడేజా(10) ధనాధన్‌ ఆడడంతో 6 వికెట్ల నష్టానికి చెన్నై భారీ స్కోర్‌ చేసింది. హర్షల్‌ పటేల్‌, మ్యాక్స్‌వెల్‌ వేసిన 20వ ఓవర్‌లో 16రన్స్‌ వచ్చాయి. టాస్‌ గెలిచి చెన్నైకి బ్యాటింగ్‌ అప్పగించిన బెంగళూరు 16 పరుగుల వద్దే రుతురాజ్‌ గైక్వాడ్‌ (3)ను అవుట్‌ చేసి సంబరాలు చేసుకుంది. అయితే, ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. కాన్వే, రహానే కలిసి పోటాపోటీగా ఆడారు. ఇద్దరూ కలిసి బెంగళూరు బౌలర్లను చితక్కొట్టారు. ఈ క్రమంలో 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేసిన రహానే 90 పరుగుల వద్ద రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. రహానేను అవుట్‌ చేసిన ఆనందం కూడా బెంగళూరుకు ఎంతోసేపు మిగల్లేదు. క్రీజులోకి వచ్చిన శివం దూబే, కాన్వే కలిసి బౌలర్లను ఊచకోత కోశారు. ఇద్దరూ కలిసి బాదుతుంటే స్కోరు 250 పరుగులు దాటడం ఖాయమనిపించింది. ప్రమాదకరంగా మారి సెంచరీ దిశగా దూసుకెళ్తున్న కాన్వేను హర్షల్‌ పటేల్‌ బౌల్డ్‌ చేశాడు. 45 బంతులు ఆడిన కాన్వే 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 83 పరుగులు చేశాడు. ఆ తర్వాత 8 పరుగులకే దూబే కూడా అవుట్‌ కావడంతో పరుగుల వేగం మందగించింది. 27 బంతులు ఎదుర్కొన్న దూబే 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. అంబటి రాయుడు 14, మెయిన్‌ అలీ 19(నాటౌట్‌) రవీంద్ర జడేజా 10 పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్‌, పార్నెల్‌, వైశాఖ్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, హసరంగ, హర్షల్‌ పటేల్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు.
స్కోర్‌బోర్డు...
చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: గైక్వాడ్‌ (సి)పార్నెల్‌ (బి)సిరాజ్‌ 3, కాన్వే (బి)హర్షల్‌ పటేల్‌ 83, రహానే (బి)హసరంగ 37, శివమ్‌ దూబే (సి)సిరాజ్‌ (బి)పార్నెల్‌ 52, అంబటి రాయుడు (సి)దినేశ్‌ కార్తీక్‌ (బి)వ్యాషక్‌ 14, మొయిన్‌ అలీ (నాటౌట్‌) 19, జడేజా (సిాసబ్‌)ప్రభుదేశారు (బి)మ్యాక్స్‌వెల్‌ 10, ధోనీ (నాటౌట్‌) 1, అదనం 7. (20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 226పరుగులు.
వికెట్ల పతనం: 1/16, 2/90, 3/170, 4/178, 5/198, 6/224
బౌలింగ్‌: సిరాజ్‌ 4ా0ా30ా1, పార్నెల్‌ 4ా0ా48ా1, వ్యాషక్‌ 4ా0ా62ా1, మ్యాక్స్‌వెల్‌ 2.4ా0ా28ా1, హసరంగ 2ా0ా21ా1, హర్షల్‌ పటేల్‌ 3.2ా0ా36ా1