Jun 30,2023 14:44

న్యూఢిల్లీ  :  స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వారాంతంలోనూ లాభాల్లో కొనసాగుతున్నాయి. బుధవారం జీననకాల గరిష్టానికి చేరుకున్న సెన్సెక్స్‌, నిఫ్టీలు, శుక్రవారం మరోసారి రికార్డు స్థాయిని తాకాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 64,312 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ మరోసారి 19,071 పాయింట్లకు చేరింది. మార్కెట్లలో అమ్మకాలు పుంజుకోవడంతో శుక్రవారం సూచీలు మరోసారి గరిష్టస్థాయిని చేరినట్లు నిపుణులు పేర్కొన్నారు.