Dec 22,2022 09:04

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రైల్వే ప్రైవేటీకరణను ఆపాలని, ఎన్‌ఎస్‌పిని ఉపసంహరించాలని, ఓపిఎస్‌ని పునరుద్ధరించాలని కోరుతూ ఆల్‌ ఇండియా లోకో రన్నింగ్‌ స్టాఫ్‌ అసోసియేషన్‌ (ఎఐఎల్‌ఆర్‌ఎస్‌ఎ) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు జాతీయ స్థాయిలో క్రూ లాబీల వద్ధ బుధవారం రన్నింగ్‌ సిబ్బంది విజయవాడ, రాజమండ్రిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఐఎల్‌ఆర్‌ఎస్‌ఎ నాయకులు రామకృష్ణ మాట్లాడుతూ రైల్వేలో ఖాళీలను తక్షణమే పూర్తి చేయాలని, 7వ సిపిసిలో పెంచిన రన్నింగ్‌ అలవెన్స్‌ ప్రకారం టిఎ భాగం 70 శాతంపై ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ మినహాయింపును పెంచాలని డిమాండ్‌ చేశారు. ఎల్‌పి (ఎస్‌హెచ్‌జి)జిఆర్‌-1 రద్దు కోసం ఇచ్చిన ఆర్‌బి ఆర్డర్‌ను ఉపసంహరించుకోవాలని, 40 గంటలు పిఆర్‌ ఇవ్వాలని, మహిళ లోకో రన్నింగ్‌ స్టాఫ్‌ అమానవీయ పని పరిస్థితులను నిలుపుదల చేయాలని కోరారు. హెచ్‌ఓఇఆర్‌ ప్రకారం తొమ్మిది గంటల డ్యూటీని పరిమితం చేయాలని, ఆర్‌వాల్వ్‌ లొకేషన్‌ ఎఎల్‌పిఎస్‌ డెస్క్‌మార్చాలని, సివివిఆర్‌ఎస్‌ ద్వారా సిబ్బంది పనితనాన్ని విశ్లేషణను ఆపాలని కోరారు. ఎన్‌డిఎపై సీలింగ్‌ పరిమితిని ఎత్తివేయాలని, పెండింగ్‌లో ఉన్న అన్ని ఐఆర్‌ఆర్‌టి/డిటి బదిలీలను క్లియర్‌ చేయాలని ఎఐఎల్‌ఆర్‌ఎస్‌ఎ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ డివిజనల్‌ ప్రెసిడెంట్‌ ఎం.వెంకటేషన్‌, బ్రాంచ్‌ సెక్రటరీ ఎండి అయాజ్‌పాష, ఎస్‌సిఆర్‌ఇఎస్‌ లోకో రన్నింగ్‌ బ్రాంచ్‌ నుంచి స్వర్గం శ్రీనివాస్‌, ఓబిసి సెక్రటరీ శ్రీకాంత్‌ యాదవ్‌, బ్రాంచ్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌వి రాము కూడా మాట్లాడారు.