Mar 17,2023 20:17

దంత సమస్యలపై చిన్నారులకు సలహాలు ఇస్తున్న వైద్యులు

మదనపల్లె అర్బన్‌
నేషనల్‌ ఓరల్‌ హెల్త్‌ సందర్బంగా పట్టణంలోని అమ్మచెరువుమిట్టలో వెలుగు సంస్థలో చిన్నారులకు, వృద్ధులకు జిల్లా ఆస్పత్రి దంత వైద్యులు అఫ్షాన్‌బేగం, బి.కొత్తకోట పిహెచ్‌సి దంత వైద్యులు దుర్గాదేవి ఆధ్వర్యంలో దంత పరీక్షలు నిర్వహించారు. ప్రత్యేక పాఠశాల తరగతి గదులను, బోధన పద్ధతులను, ఒకేషనల్‌ నందు హ్యాండ్‌ ఎంబ్రాయిడరీ, టైలరింగ్‌, అగర్‌ బత్తి, కంప్యూటర్‌లో దివ్యాంగులు ప్రతిభను చూసి ప్రశంసించారు. ప్రిన్సిపల్‌ పి.లీనాకుమారి వెలుగు కార్యకలాపాలు గురించి వారికి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 20న నేషనల్‌ ఓరల్‌ హెల్త్‌డే సందర్భంగా వారం రోజుల పాటు వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు రెండుసార్లు దంతాలను శుభ్రం చేసుకోవాలని ముఖ్యంగా రాత్రి పడుకునేముందు తప్పకుండ దంతాలను శుభ్రపరచు కోవాలని సూచించారు. డాక్టర్‌ దుర్గాదేవి మాట్లాడుతూ బ్రెష్‌ చేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా వివరించారు. 100 మంది విభిన్న ప్రతిభావంతులకు, 50 మంది వద్దులకు దంతాలను పరీక్షించారు. అందరికి పేస్టులు, బ్రష్‌లు అందజేశారు. వెలుగు సెక్రటరీ యం.ఉదరు మోహన్‌ రెడ్డి, కన్వీనర్‌ ఆర్‌.భాగ్యలక్ష్మి, ప్రిన్సిపల్‌ పి.లీనాకుమారి, సోషల్‌వర్కర్‌, యం.గీత, వెలుగు సిబ్బంది, చిన్నారులు, వద్ధులు,ఆశ కార్యకర్తలు రెడ్డికుమారి, మెర్సీగ్రేసి పాల్గొన్నారు.