Mar 17,2023 20:20

మాట్లాడుతున్న ఇన్‌ఛార్జి అటవీ శాఖ అధికారి నారాయణ

చిట్వేలు : మండల పరిధి లోని పెనుసిల లక్ష్మీ నరసింహ స్వామి అభయ అర ణ్యంలో ఇటీవల అమర్చిన 20 కెమెరాలకు అరు దైన జంతువులు కని పించడం జరిగిందని ఇన్‌ఛార్జి మండల అటవీ శాఖ అధికారి ఆర్‌.నారాయణ తెలిపారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అడవిలో సంచరిస్తున్న జంతువుల కదలికలను తెలుసుకునేందుకు 20 రోజుల క్రితం కెమెరాలను ఆమర్చడం జరిగిందని, అయితే అరుదుగా మల్లెమడుగు రస్తా దగ్గర , కూటాల మర్రికి వెళ్లే గంగమ్మ గుడి దగ్గర రెండు వేరువేరు చిరుతలు సంచరిస్తున్నట్లు కెమెరాలో చిత్రాలు లభించాయని అన్నారు. ఈ కెమెరాలను మరో 20 రోజులు వరకు అక్కడే ఉంచుతామని తెలిపారు. ఇలా గుర్తించడం ద్వారా ఈ కారిడార్‌లో ఉన్న పూర్తి జంతువుల కదలికలతో పాటు వాటి మనుగడకు కావలసిన చర్యలు తీసుకునేందుకు వీలుంటుంది అన్నారు. సోమశిల రిజర్వాయర్‌ ఈ అటవీ ప్రాంతానికి అందుబాటులో ఉన్నందున జంతువుల మనుగడకు ఎంతో ఉపయోగ పడుతుందని అన్నారు. అడవిలో అగ్ని ప్రమాదాలు ఈ సంవత్సరం ఇప్పటివరకు పెద్దగా జరగలేదని, ఒకవేళ జరిగితే తక్షణం చర్యలు తీసుకునేందుకు సిబ్బంది సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇంత అరుదైన అటవీ ప్రాంతాల్లో అడవి జంతువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని పైన ఉందన్నారు. సమావేశంలో ఎఫ్‌ఎస్‌ఒ శ్రీనివాసులు, సావిత్రి, కరిముల్లా ,సుబ్బయ్య పాల్గొన్నారు.