Jun 29,2023 10:47

టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ కలిసి నటించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌.. ఈ మూవీ ఎన్నో అంతర్జాయతీ అవార్డులను.. ఎంతో ప్రతిష్టాత్మకమైన 'ఆస్కార్‌'ను సాధించి పెట్టింది. తాజాగా ఆస్కార్‌ కమిటీ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కు మరో ఆహ్వానం అందింది. 'ఆర్‌ఆర్‌ఆర్‌' గెలుచుకోవడమే కాకుండా ఏకంగా అకాడెమీ జ్యూరీ మెంబర్స్‌గా ఆరుగురుకి స్థానం కలిపించింది. తాజాగా అకాడెమీ లేటెస్ట్‌గా జ్యూరీలో యాడ్‌ అయిన 398 మంది సభ్యుల లిస్టును విడుదల చేసింది. ఈ లిస్టులో 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో అదరగొట్టిన ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, సాబు సిరిల్‌, కీరవాణి, చంద్రబోస్‌, సెంథిల్‌ ఉన్నారు. కొత్తగా చేరిన మెంబర్స్‌ తో కలిపి ప్రపంచ వ్యాప్తంగా అకాడెమీ జ్యూరీ లిస్టులో 10,817 మంది ఉన్నారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం, బాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్స్‌ కరణ్‌ జోహార్‌, సిద్ధార్థ్‌ రాయ్ కూడా జ్యూరీ మెంబర్స్‌గా చోటు దక్కించుకున్నారు. ఆస్కార్‌ జ్యూరీ మెంబర్లుగా తారక్‌, చరణ్‌లకు స్థానం లభించడంతో వారి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ హంగామా చేస్తున్నారు.