May 23,2023 11:25

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' మూవీలో ప్రతినాయకుడిగా నటించిన హాలీవుడ్‌ నటుడు రే స్టీవెన్సన్‌ (58) మృతి చెందారు. స్టీవెన్సన్‌ తీవ్రమైన అనారోగ్య కారణం వల్లే మృతి చెందినట్లు ఇటాలియన్‌ వార్త పత్రిక రిపబ్లికా వెల్లడించింది. స్టీవెన్స్‌ తాజ చిత్రం 'క్యాసినో'. ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నప్పుడు ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూనే పరిస్థితి విషమించి ఆయన మృతి చెందినట్లు రిపబ్లికా పత్రిక వెల్లడించింది. స్టీవెన్‌ సన్‌ మృతి చెందడంతో.. ఆర్‌ఆర్‌ఆర్‌ టీం షాక్‌కి గురైంది. 'మీరెప్పుడూ మా మదిలో నిలిచే ఉంటారు' అని ఆర్‌ఆర్‌ఆర్‌ టీం ట్వీట్‌ చేసింది. టాలీవుడ్‌తోపాటు, పలువురు హాలీవుడ్‌ నటులు స్టీవెన్‌ మృతికి సంతాపం వ్యక్తం చేశారు.
కాగా, కింగ్‌ ఆర్థర్‌, ది అదర్‌ గైస్‌, ది ట్రాన్స్‌పోర్టర్‌ వంటి పలు సినిమాలు స్టీవెన్‌కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అలాగే ఆయన సినిమాలకు ముందు థోర్‌ సిరిసీతో బాగా ఫేమస్‌ అయ్యారు. చివరగా ఆయన యాక్సిడెంట్‌ మ్యాన్‌ సినిమాలో నటించారు. స్టీవెన్సన్‌1997లో బ్రిటిష్‌ నటి రుత్‌ గెమ్మెల్‌ను వివాహం చేసుకున్నారు. అయితే ఎనిమిదేళ్ల్ల తర్వాత ఈ జంట విడాకులు తీసుకుంది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు.