Sep 26,2022 07:49

ఎన్ని ఓటములు ఎదురైతేనేం
ఒక్క ఆలోచన వ్యూహంగా మారి
రేపటి వైపు ఆశగా నడిపిస్తుంది

ఆశ శ్వాసగా మారితే
మలుపు కొత్త రూపుని దాల్చుతుంది
ఆశయం ఆకాశాన్ని తాకితే
అద్భుతం అన్నది ఆగమేఘమై వాలుతుంది
నిరాశ అన్నది దహించే నిప్పు అయినా
ఆలోచన ఉప్పెనై లేస్తూ
మున్ముందుకు నడిపి, నిలిపిస్తుంది
ఉక్కిరి బిక్కిరి క్షణాలు తేటతెల్లం అవుతూ
చెరగని స్వప్నమై నిలువరిస్తుంది!

వంద ఓటములు మోకరిల్లుతూ
ఒక్క విజయం ధీరత్వాన్ని పెంపొందిస్తుంది
ఆశల శ్వాసల నడక
గెలుపు గుర్రమై బతుకుని విజయపథం వైపు
దౌడు తీయిస్తోంది!

- మహబూబ్‌ బాషా చిల్లెం
95020 00415