Sep 19,2022 07:52

నువ్వు ..
నవగ్రహాల్లో ఓ గ్రహానివి కాదు
వేల, లక్షల చుక్కల్లో ఓ చుక్కవి కాదు
కోటానుకోట్ల ఇసుక రేణువుల్లో
ఓ ఇసుక రేణువువి కాదు

నువ్వు కరగని మంచు గడ్డవి
ఆరని అగ్నిశిలవి ఆగని పెనుగాలివి
తరగని పర్వతానివి ఇంకని సముద్రానివి
భూమ్యాకాశాల బంధానివి
పంచ భూతాల పరమార్థానివి
విశ్వ రహస్యాలను ఛేదనవు
శబ్ద... స్పర్శ... చూపు... వాసన
గాలి... నీరూ... నిప్పూ... నింగి.. నేల
సహస్ర శోధనల సమూహ వీక్షణ నీవే
శబ్ద ఘీంకర రహస్య ఛేదన నీవే.. నీవే

నీ ఒక... బహిరంగ రహస్యానివే ...
నిన్ను ఆవహించిన వాళ్ళకి తప్పని
సంకెళ్లు... నిర్బంధాలు... మరణ శిక్ష
నీకు మరణం లేదు.. నీవు ఎవరు...?
నీ.. ఒక ప్రశ్నవీ... మరణం లేని ప్రశ్నవి!
 

- రెడ్డి శంకరరావు
94943 33511