సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజులు
ప్రజాశక్తి - రాయచోటి టౌన్ : వెలుగులో పనిచేస్తున్న విఒఎలకు ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజులు, ఉఫాధ్యక్షులు పి.శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని వెలుగు విఒఎలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘ మిత్రులకు ప్రభుత్వం మూడు సంవత్సారాలు కాలపరిమితి నిర్ణయించడం సరైంది కాదన్నారు. బకాయివేతనాలు చెల్లించాలని తెలిపారు. 65 సర్క్యులర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 45 ఏళ్లు పూర్తిచేసుకున్న వారిని తొలగించాలనుకోవడాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. సంఘాలు మెర్జింగ్ వలన చాలా మంది ఉపాధి కోల్పోతారని దీన్ని సిఐటియు ఖండిస్తున్నదని పేర్కొన్నారు. సంఘ మిత్ర జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కృష్ణమ్మ, పరంజ్యోతి, రెడ్డెప్ప మాట్లడుతూ జెండర్ వయసు చదువుల పేరుతో క్రమంగా యానిమేటర్ వ్యవస్థ లేకుండా చేయాలనీ చేస్తున్నాదన్నారు. ఉద్యోగ భద్రత కోసం ఉధృత పోరాటాలు చేయాల్సిన అవసరం వుందన్నారు. కనీస వేతనం, ఇఎస్‌ఐ, పిఎఫ్, రిటైర్డ్ మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ ఇవ్వలన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతపత్రాన్ని డిఆర్‌ఒ సత్యనారాయణకు అందజేశారు. కార్యక్రమంలో ప్రసాద్, రమణారెడ్డి, రాణి, సుబ్రమణ్యం, చంద్రకళ, ప్రభాకర్, నారాయణ, ఓబులేసు, జిల్లా నలుమూలల సంఘ మిత్రలు పాల్గొన్నారు.










