చదువుకు త్యాగము
పాఠశాలకు పుస్తకము
ఆలోచనకు మస్తిష్కము
తెలుసుకో.. విద్యార్థి ..!!
నిరంతర అధ్యయనం
జీవితములో విజయము
గెలుపుతో గౌరవము
తెలుసుకో.. విద్యార్థి..!!
అమ్మ చేతి కమ్మదనం
నాన్న మనస్సు తీయదనం
ఎదుగుదలే వారి గొప్పదనం
తెలుసుకో.. విద్యార్థి...!!
గురువులే దైవము
జ్ఞానమే మార్గము
శ్రమయే జీవితము
తెలుసుకో.. విద్యార్థి..!!
ఆటపాటలతో ఆరోగ్యం
పాఠశాలే మహాభాగ్యం
వదులుకుంటే అనారోగ్యం
తెలుసుకో... విద్యార్థి..!
చదువును ప్రేమించుము
తెలివిని సంపాదించుము
సాధించు సామర్ధ్యము
తెలుసుకో... విద్యార్థి...!
ఉన్నతమైన చదువులు
జీవితానికి వెలుగులు
అమ్మానాన్నల కలలు
తెలుసుకో... విద్యార్థి..!
ఉద్యోగమే ధ్యేయం
అభివద్ధే సాధనం
ఉన్నతమైన లక్ష్యం
తెలుసుకో... విద్యార్థి..!
తోటివారికి సహాయము
తోడబుట్టిన వారి ఆధారము
ఆప్తులకు నమ్మకము
తెలుసుకో... విద్యార్థి..!
వదలకు సత్యము
ప్రవర్తించు న్యాయము
కలిగి ఉండు ధర్మము
తెలుసుకో... విద్యార్థి..!
- కొప్పుల ప్రసాద్
98850 66235










