Aug 22,2022 17:00

ప్రజాశక్తి-నందిగామ : నందిగామ పట్టణ పరిధిలో  సోమవారం  8వ సచివాలయంలో మున్సిపల్ కమిషనర్ ఎస్. జయరాం స్పందన కార్యక్రమములో పాల్గొన్నారు. ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భముగా సచివాలయనికి ప్రజలు తీసుకొని వస్తున్న అర్జీల నమోదు రిజిస్టర్ పరిశీలించారు. స్పందన కార్యక్రమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఎప్పటికప్పుడు వచ్చిన అర్జీలను నిర్ణీత సమయములోగా పరిష్కరించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. వాలంటీర్లు ప్రతి క్లస్టర్ లో అర్హులైన లబ్దిదారులను గుర్తించి వారికి రాబోయే సంక్షేమ పధకాలు అందేలా చూడాలని తెలిపారు. సచివాలయ సెక్రెటరీల మూమెంట్ రిజిస్టర్లు, సంక్షేమ పధకాల జాబితాలను పరిశీలించారు. ఈ కార్యక్రమములో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.