Aug 22,2022 22:47

ప్రజాశక్తి-విజయవాడ: ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంతో పాటు మూడు సర్కిల్స్‌ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం సోమవారం జరిగింది. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలను మేయర్‌, కమిషనర్‌ స్వీకరించారు. నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌(జనరల్‌) విభాగంనకు సంబంధించి ఒక అర్జీ, పట్టణ ప్రణాళిక విభాగం ఎనిమిది, ఇంజనీరింగ్‌ ఒకటి, పబ్లిక్‌ హెల్త్‌ విభాగం తొమ్మిది, యు.సి.డి ఒకటి, అకౌంట్స్‌ విభాగం ఏడు, రెవిన్యూ విభాగంనకు సంబంధించి మూడు అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్‌(జనరల్‌) యం.శ్యామల, ఎస్‌.ఇ నరశింహమూర్తి, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డా. పి.రత్నావళి, డిప్యూటీ కమిషనర్‌ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, ఏ.డి.హెచ్‌ శ్రీనివాసు, బయాలజీస్ట్‌ డా.బాబు శ్రీనివాసన్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. సర్కిల్‌-1 పరిధిలో రెవిన్యూ రెండు అర్జీలు, పట్టణ ప్రణాళిక ఒకటి, సర్కిల్‌ -2 కార్యాలయంలో పట్టణ ప్రణాళిక ఒకటి, సర్కిల్‌-3లో ఇంజనీరింగ్‌ విభాగం ఒకటి, పబ్లిక్‌ హెల్త్‌ విభాగం ఒక అర్జీ వచ్చింది.