Sep 11,2022 06:46

పంటలు పండంగ జోరుగా కురవవే!
కరువులను బాపంగ బిరబిరా కురవవే!

పచ్చదనం పెంచంగ చల్లగా కురవవే!
చల్లదనం నింపంగ హాయిగా కురవవే!

చిరుగాలి వేయంగ చక్కగా కురవవే!
మది పులకించంగ ముచ్చటగ కురవవే!

చిగురాకు కదలంగ చినుకు కురిపించవే
హరివిల్లు మెరవంగ తళుకై మురిపించవే!

నీలాల నింగిలో నిలుచున్న నీరమా?
వసుధంత మురవంగ చిటపటలు రాల్చవే!
 

- రావిపల్లి వాసుదేవరావు,
పార్వతీపురం మన్యం జిల్లా.