ప్రజాశక్తి-విజయవాడఅర్బన్: విజయవాడ నక్కల రోడ్డులో మిత్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ సభ్యులు మల్లాది విష్ణు ప్రారభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అత్యాధునిక సౌకర్యాలతో, అనుభవజ్ఞులు అయిన వైద్య సిబ్బంది అందించే వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కెవి సత్యనారాయణ మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్స్, పిడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, నెఫ్రాలజీ, న్యురో సర్జరీ, జనరల్ సర్జరీ డిపార్ట్‌మెంట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. త్వరలో ఆరోగ్య శ్రీ సేవలను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఆసుపత్రి ప్రారంభించిన సందర్భంగా సెప్టెంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ఒపి వైద్యసేవలు ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్ దేవినేని అవినాష్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఐయంఎ అధ్యక్షులు డాక్టర్ రషిక్ సంగ్వి, 23వ డివిజన్ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి, మిత్రా హాస్పటల్ డైరెక్టర్ డాక్టర్ గడ్డం అనూష పాల్గొన్నారు.










