ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు వివిధ క్రీడలలో పాల్గొని ప్రతిభ కనబరిచారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్‌ఎంవి.నారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని ఆదిశంకరా ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన జెఎన్‌టియుఎ-11 క్రీడా పోటీలలో బాల్‌బ్యాడ్మిటన్‌లో ద్వితీయ బహుమతి, కడప జిల్లా ప్రొద్దుటూరులోని వాగ్దేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సస్ ఇన్వైటీస్-2 కే23లో క్రికెట్‌లో ప్రథమ బహుమతి, కబడ్డీలో ద్వితీయ బహుమతి, వాలీబాల్‌లో ద్వితీయ బహుమతి సాధించిన విద్యార్థులను కళాశాల ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ చొప్పా అభిషేక్‌రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడలలో కూడా రాణించడం చాలా ముఖ్యమని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో క్రీడలకు కూడా మంచి భవిష్యత్తు ఉందన్నారు. విద్యార్థులు కళాశాల అందించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని విద్యలో, క్రీడలలో బాగా రాణించి తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కళాశాల విద్యార్థుల సౌకర్యార్థం కళాశాలలో పెన్సింగ్, ప్లెడ్ లైట్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు. అనంతరం కళాశాల వైస్ చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల అభివ ద్దికోసం తమ కళాశాలలో అన్ని వసతులను ఏర్పాటు చేస్తున్నామని, విద్యార్థులు తమ కళాశాలలోని వసతులను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ బి.నాగముని, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










