Oct 03,2022 07:38

ఆమె
కొలనును ప్రేమగా పొదువుకొని
కమ్మని కలలు కంటోంది !
ఏదో రాయి తాకిన శబ్దం
కలవరం కలిగించే కంపనం
తొలుత కల అనుకొంది
తరువాత భ్రమ అనుకొంది
కాదు; సహజ అలేనని సరిపెట్టుకొంది!

మళ్లీ మళ్లీ కరకు రాళ్లు
ప్రశాంత కొలనును
కల్లోల పరుస్తూనే ఉన్నాయి!
కొలనే కంపనాలను సృష్టిస్తుందని
అర్థమయ్యాక ...
ఆమె అక్కడి నుంచి
నిశ్శబ్దంగా నిష్క్రమించింది !

- తనూప్రియ