Mar 28,2023 20:34

కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేస్తున్న ఎంపీ మిథున్‌రెడ్డి

ఓబులవారిపల్లి: జిల్లాలోని రైల్వేకోడూరు, ఓబులవారిపల్లి, పుల్లంపేట, రాజంపేట, నందలూరు రైల్వేస్టేషన్లలో కోవిడ్‌ సమయంలో రద్దు చేసిన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఆపాలని ఢిల్లీలో మంగళవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, గుంతకల్‌ రైల్వే బోర్డు సభ్యులు తల్లెం భరత్‌ కుమార్‌రెడ్డి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వే ప్రయాణికులకు, రైతులకు, దూర ప్రయాణాలు ప్రయాణించే వారికి ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. రైల్వేకోడూరు వాసులకు ఎప్పటినుండో తీరని కోరికగా ఉన్న అండర్‌ బ్రిడ్జి, ఓబులవారిపల్లి అండర్‌ బ్రిడ్జ్‌ నిర్మాణం త్వరగా నిర్మాణాలు చేపట్టి ఆ ప్రాంత వాసులకు ఇబ్బందులు తొలగించాలని కోరారు. కోవిడ్‌ పరిస్థితులు చక్కబడిన తర్వాత రైళ్లను నిలుపుదల పునరుద్ధరణ చేయకపోవడంతో ప్రయాణికుల అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. స్పందించిన కేంద్ర మంత్రి త్వరలో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.