Mar 29,2023 16:03

ప్రజాశక్తి-కలకడ: మండలంలోని కదిరాయి చెరువు పంచాయితీ కదిరాయి చెరువు మర్రిపాడు బస్సు షెల్టర్ నందు జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న ఎండల తీవ్రతను తట్టుకునేలా ప్రజలు నీటి దాహార్తిని తీర్చుకోవడానికి సర్పంచ్ లక్ష్మీప్రసన్నకమల్ నాథ్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అదేవిధంగా మండలంలోని బాలయ్య పల్లి పంచాయతీ ఎర్రయ్యగారిపల్లి బస్సు షెల్టర్ నందు డిప్యూటీ తహసిల్దార్ సయ్యద్ అహ్మద్ చేతుల మీదుగా చలివేంద్రాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సిహెచ్ నారాయణ,  ఆర్ ఐ మస్తాన్ కమలాకర్, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఏలు, సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.