Mar 24,2023 20:44

- సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి : బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ గిరీషా పిఎస్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ గిరీషా మాట్లాడుతూ జిల్లాలో తొమ్మిది కొత్త బ్యాంకు శాఖలను ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశామని, అందులో ఆర్‌బిఐ నుంచి 3 కొత్త బ్యాంకులకు అప్రూవల్‌ ఇచ్చారని, మిగిలిన 6 పెండింగ్‌లో ఉన్నాయిని, వాటిని త్వరగా క్లియర్‌ చేయాలని ఆర్‌బిఐ అధికారులకు కలెక్టర్‌ సూచించారు. అన్నమయ్య జిల్లా ఆర్థిక అభివద్ధి వైపు పరుగులు తీసేలా బ్యాంకర్లు ఆర్థిక చేయూతనందించాలని చెప్పారు. అన్నమయ్య జిల్లా వ్యవసాయ రంగంపై ఆధారపడిన నేపథ్యంలో వ్యవసాయ ఆధారిత కంపెనీల ఏర్పాటుకు సహకరించాలన్నారు. ముఖ్యంగా జిల్లాలో పండిస్తున్న పంటలు నిల్వచేసుకోవడానికి అవసరమైన గోదాములు, శీతల గిడ్డంగుల నిర్మాణానికి కషి చేయాలన్నారు . స్వయం సహాయక సంఘాలలోని పొదుపు మహిళల జీవనోపాధివద్ధికి తోడ్పాటునివ్వాలన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు బ్యాంకర్లు సహకరించాలని చెప్పారు. ప్రభుత్వ పథకాలను మంజూరు చేసి, గ్రౌండింగ్‌ చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. వివిధ ప్రభుత్వ పథకాల మంజూరు, డిసెంబరు వరకు సాధించిన ప్రగతిపై శాఖలవారీగా సమీక్షించారు. అర్హత ఉన్నవారికి రుణాలు ఇచ్చి ప్రోత్సహించాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందన్నారు. పరిశ్రమల శాఖ, డిఆర్‌డిఏ, మెప్మా, ఉద్యానశాఖ, వ్యవసాయం తదితర శాఖల ద్వారా మంజూరు చేయాల్సిన రుణాలపైన, పథకాలపైనా, బ్యాంకుల వారీగా సమీక్షించారు. జగనన్న తోడు పథకం క్రింద చిరువ్యాపారులకు ఇస్తున్న రుణాలపై దష్టి పెట్టాలని, అధిక సంఖ్యలో వీటిని మంజూరుచేసి ఆదుకోవాలని సూచించారు. స్టాండ్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రతి బ్యాంక్‌ రెండు రుణాలు మంజూరు చేయాలన్నారు. దరఖాస్తును పరిశీలించి, అవసరమైతే యూనిట్‌ స్థాపించే ప్రదేశాన్ని కూడా సందర్శించాలని సూచించారు. డిఆర్‌డిఎ మెప్మా ద్వారా మహిళా సంఘాలకు ఇస్తున్న రుణాలు సద్వినియోగం అయ్యేలా చూడాలన్నారు. సమయం తక్కువగానే ఉన్నప్పటికీ, ఈ నెలాఖరులోగా బ్యాంకులకు ఇచ్చిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్‌ ఆదేశించారు. అనంతరం ఎల్డీఎం వెంకటేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో రూ.9381 కోట్ల నిధులు వెచ్చించాలని లక్ష్యం కాగా ఇప్పటివరకు రూ.14120 కోట్లు వెచ్చించారన్నారు. ప్రాధాన్యత రంగాల వద్ధిలో 140 శాతానికి చేరుకున్నారని కలెక్టర్‌కు వివరించారు. వ్యవసాయ రంగానికి ఇప్పటివరకు 158 శాతం రుణ సదుపాయం కల్పించామన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ జడ్‌ఎం నాగరాజు, డిఆర్‌ డిఏ పిడి సత్యనారాయణ, యూబిఐ ఆర్‌ఎం భాస్కర్‌, సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఆర్‌ఎం జిఎంవి ప్రసాద్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.