రాయచోటి : విశిష్ట సేవలకు గుర్తింపుగా అర్చకులకు కలెక్టర్ గిరీష మంగళవారం తన ఛాంబర్‌లో జిల్లాలోని ముగ్గురిని ఘనంగా సన్మానించి ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా దేవదాయ శాఖ జిల్లా అధికారి సి.విశ్వనాథ్ మాట్లాడుతూ శ్రీ శోభ కత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం పురస్కరించుకొని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్, విజయవాడ వారి సూచనల ప్రకారం జిల్లాలో విశిష్ట సేవలు అందించిన కురబలకోట శ్రీకోదండరామస్వామి ఆలయ పూజారి మల్లికార్జున, మదనపల్లి మండలం శ్రీనుమలు గంగమ్మ ఆలయ పూజారి బసినికొండ ఎం. వెంకట రమణ, పీలేరు మండలం శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం అర్చకుడు పి.ఎస్. నరసింహన్ కు ఒకొక్కరికి రూ.10,116 సంభావన, శాలువాతో సన్మారించి ప్రశంస పత్రాలు కలెక్టర్ చేతుల మీదుగా అందజే శారన్నారు. అనంతరం ఉగాది పర్వదినాన పురస్కరించుకొని అర్చకులు కలెక్టర్ గారికి ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని అర్చకులు తెలిపారు. కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా దేవదాయ శాఖ జిల్లా అధికారి సి.విశ్వనాథ్, రాయచోటి శ్రీ వీరభద్ర స్వామి కార్యనిర్వహక అధికారి రమణారెడ్డి, ముఖ్య అర్చకులు చంద్రశేఖర్ స్వామి, అర్చకులు మల్లికార్జున్, లక్కిరెడ్డిపల్లి గంగమ్మ దేవస్థానం ఇఒ రాజు, పాల్గొన్నారు.










