Jun 20,2022 06:49

ఒకరి ముఖంలో చిరునవ్వు
వెలిగించటానికి నా జీవితం అంకితం
ఒకరి బాధ పంచుకోవడానికి నా జీవితం అంకితం
మానవాళిపై నిండైన ప్రేమతో నా హదయం అంకితం
ఇదే కదా జీవించడం అంటే ..!

జేబులో పైసా లేదు
హృదయం మాత్రం ప్రేమతో నిండిపోయింది
ఎదుటివారికోసం స్పదించే మనసు గొప్పది
గాయపడిన మనసుకు ఓదార్పునిచ్చే మాట గొప్పది
దు:ఖంలో ఉన్నవారి అశ్రువులు తుడిచే చెయ్యి గొప్పది
ఆకలితో కేకలు చేసేవారికి
ఒక రొట్టె ముక్క ఇచ్చే ఔదార్యం
ఇదే కదా జీవించడం అంటే ...

మృత్యువు నన్ను తీసుకొనిపోయినాగాని
మీ అందరి జ్ఞాపకాల్లో సజీవంగా ఉంటాను
మీ కన్నీళ్లలో కూడా నేను నవ్వుతూ ఉంటాను
ఒక వికసిత పుష్పం చెపుతోంది మొగ్గలతో
ఇదే కదా జీవించడం అంటే ..!
- అరుణ డేనియల్‌
90006 06889