Mar 28,2023 20:27

- సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి

 రాయచోటిటౌన్‌ : అక్క చెల్లెమ్మలకు బాసటగా వైఎస్‌ఆర్‌ ఆసరా నిలుస్తుందని వైసిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మాసాపేట, మార్కెట్‌ యార్డులో మాసాపేట1, మాసాపేట2, మహబూబ్‌ నగర్‌, కొత్తపల్లె1, కొత్తపల్లె2, సచివాలయాల పరిధిలోని స్వయం సహాయక సంఘాలతో, అలాగే మున్సిపల్‌ కార్యాలయంలోనూ కొత్తపల్లె 2, బేతల్‌ కాలనీ, రెడ్డీస్‌ కాలనీ, మహబూబ్‌బాష వీధి, ఎస్‌ఎన్‌ కాలనీ -1,2, బోస్‌ నగర్‌ 4 సచివాలయ పరిధిలోని స్వయం సహాయక సంఘాలతో వేర్వేరుగా ఆసరా మూడో విడత సమావేశాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ముందుగా మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. మున్సిపల్‌ కమిషనర్‌ గంగా ప్రసాద్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అలుపెరగని పాదయాత్రలో అక్క చెల్లెమ్మలుకు జగనన్న ఇచ్చిన హామీ నేడు మూడు విడతలుగా కార్యరూపం దాల్చిందన్నారు. గత ప్రభుత్వాలు మహిళా సంఘాలను భారీ సమావేశాలకు తరలించుకున్నారే తప్ప వారికి లబ్ది చేకూర్చింది లేదన్నారు. ఎన్నికల నాటికి ఆయా సంఘాలంకు బ్యాంకుల్లో ఉన్న రుణాన్ని నాలుగు విడతలుగా మాఫీ చేస్తుందన్నారు. రైతుల కోసం ప్రాజెక్టుల నిర్మాణం, అక్క చెల్లెమ్మల కోసం చేయూత, సున్నా వడ్డీ, అమ్మ ఒడి, విద్యా దీవెన తదితర ఎన్నో పథకాలును అమలు చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్నారు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలును లక్షాధికారులుగా చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. నియోజక వర్గ అభివద్దికి అనునిత్యం కషి చేస్తానన్నారు. పట్టణంలో 4 పట్టణ ఆరోగ్య కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. వంద పడకల ఆస్పత్రి నిర్మాణాలు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింతగా పటిష్టం చేస్తున్నారన్నారు. అనంతరం మహబూబ్‌నగర్‌ సచివాలయ పరిధిలోని 195 సంఘాలకు గాను వైఎస్‌ఆర్‌ ఆసరా కింద జమ అయిన రూ.1.30 కోట్ల మెగా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ షేక్‌ ఫాయాజ్‌ బాషా, మదనపల్లె పరిశీలకులు హాబీబుల్లా ఖాన్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ తబ్రేజ్‌, డిఆర్‌డిఎ ఆన్‌ఛార్జి పీడీ సత్యనారాయణ, కౌన్సిలర్లు సుగవాసి పద్మావతి, రౌనక్‌, గౌస్‌ ఖాన్‌, నవరంగ్‌ నిస్సార్‌, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన్‌ విజయభాస్కర్‌, కో - ఆప్షన్‌ సభ్యులు అయ్యవారు రెడ్డి, మైమున్నీసా, కొత్తిమీర ప్రసాద్‌, రియాజుర్‌ రెహమాన్‌, నవాజ్‌ క్రిష్‌, విక్కీ దేవేంద్ర, జావీద్‌, అమీర్‌, కొత్తపల్లె ఇంతియాజ్‌, హజరత్‌ ఖాదర్‌ వలీ పాల్గొన్నారు.