Sep 11,2022 06:52

మిసమిస మబ్బులు కమ్మాయి
పెళపెళ ఉరుములు ఉరిమాయి
తళతళ మెరుపులు మెరిసాయి
జలజల వానలు కురిసాయి
గబగబా చెరువులు నిండాయి
చకచక పొలములు తడిసాయి
కళకళ మొక్కలు మొలిచాయి
పకపక పువ్వులు నవ్వాయి
గబగబ పంటలు పండాయి
కిలకిల పక్షులు పాడాయి
నవనవ కాంతులు విరిసాయి
మిలమిల మోములు మురిసాయి!


- డి.కె.చదువులబాబు,
ప్రొద్దుటూరు, కడప జిల్లా.