Aug 18,2023 11:12

ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్‌ కోనసీమ) : ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని శుక్రవారం తెల్లవారుజామున స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ పారిశుధ్య కార్మికులు మండపేటలో మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కే కృష్ణవేణి మాట్లాడుతూ ... జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం వచ్చి 4 ఏళ్ళు అవుతున్న కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయకపోవడం దారుణం అన్నారు. పట్టణ పరిశుభ్రతకు పాటుపడుతూ కరోనా సమయంలోను వారి ప్రాణాలను ఫణంగా పెట్టి సేవలందించిన కార్మికులను దృష్టిలో ఉంచుకొని వారికి న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్య కార్మిక నాయకులు కుమారపునరేంద్ర ,కుమార్‌ బంగారు కొండ, కె విజరు, నాగేంద్రప్రసాద్‌, చిన్న ,రాజు, లావరాజు, హేమలత, రత్నం, అమ్ములు, సన్యాసమ్మ, ఆదిలక్ష్మి, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.