Aug 21,2023 13:05

ప్రజాశక్తి-పుట్టపర్తి అర్బన్‌ (అనంతపురం) : మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ ... కార్మికులు చేపట్టిన బైకు ర్యాలీ ని పోలీసులు అడ్డుకొని నాయకులను అరెస్టు చేశారు. సోమవారం మున్సిపల్‌ కార్యాలయం నుంచి కలెక్టర్‌ కార్యాలయానికి బైక్‌ ర్యాలీ చేపట్టిన కార్మికులు, యూనియన్‌ నాయకులను అర్బన్‌ పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. పోలీస్‌ చర్యను ఖండిస్తూ కార్మికుల నినాదాలు చేశారు. అరెస్టు అయిన వారిలో మున్సిపల్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, మున్సిపల్‌ కార్మిక యూనియన్‌ నాయకులు రామయ్య, పెద్దన్న, గోవిందు, నాగార్జున, నరసింహులు, తదితరులు ఉన్నారు.