Sep 24,2023 08:45
  • స్వచ్ఛాంధ్ర కార్పొనేషన్‌ ఎమ్‌డి గంధం చంద్రుడు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పారిశుధ్య నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తున్న కార్మికుల సేవలకు గానూ ఈ నెల 25న సత్కారం ఏర్పాటు చేస్తున్నట్లు స్వచ్ఛాంధ్ర కార్పొనేషన్‌ ఎమ్‌డి గంధం చంద్రుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనరు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగనుందన్నారు. ప్రతి జిల్లా నుంచి ఎంపిక చేసిన పలువురి సఫాయి కార్మికులకు, 32 పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల నుంచి ఒక్కొక్కొరికి చొప్పున సన్మానిస్తారని పేర్కొన్నారు.