Aug 22,2022 10:05

కంచికచర్ల (ఎన్‌టిఆర్‌) : లారీ యూటర్న్‌ తీసుకుంటుండగా ... ఆర్‌టిసి బస్సు ఢీకొట్టడంతో లారీ డ్రైవర్‌ తలకు గాయమైన ఘటన సోమవారం తెల్లవారుజామున కంచికచర్ల మండల పరిధిలోని కీసర బిజెటి కళాశాల వద్ద చోటుచేసుకుంది.

ఈరోజు తెల్లవారుజామున ఇసుక టిప్పర్‌ బిజెటి కాలేజ్‌ వద్ద లారీ యూటర్న్‌ తీసుకునే క్రమంలో.. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న ఆర్‌టిసి బస్సు, లారీని ఢీకొట్టి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. బస్సులో ఉన్న ప్రయాణీకులంతా క్షేమంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు బస్సులో మొత్తం 31 మంది ప్రయాణిస్తున్నారు. లారీ డ్రైవర్‌ గోపికి తలకు గాయం కావడంతో హైవే అంబులెన్స్‌ లో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్సై సుబ్రమణ్యం, వీరులపాడు ఎస్‌ఐ సోమేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు.