పార్వతీపురానికి చెందిన నారంశెట్టి బాలసాహిత్య పీఠం గత ఆరేళ్లుగా బాలసాహిత్యంలో విశేష కృషి చేసిన వారికి నగదు పురస్కారాలను ప్రకటిస్తోంది. 2022 నవంబరు 14 నెహ్రూ జయంతి సందర్భంగా పురస్కారాలను ప్రదానం చేసేందుకు ఇద్దరినీ ఎంపిక చేసింది. పార్వతీపురానికి చెందిన బాలసాహితీవేత్త బెహరా ఉమామహేశ్వరరావు, హైదరాబాదుకి చెందిన మంచి పుస్తకం తరపున కొసరాజు సురేష్ ఎంపికయ్యారు. వీరికి ఒక్కొక్కరికి రూ.ఐదు వేల నగదు పారితోషికంతో బాటు, జ్ఞాపిక, శాలువాతో నవంబరు 13 ఆదివారం పార్వతీపురంలో జరిగే సభలో ప్రముఖుల చేతుల మీదుగా సన్మానం ఉంటుంది.
- నారంశెట్టి బాలసాహిత్య పీఠం, పార్వతీపురం, 94907 99203










