Oct 03,2022 07:41

ఉండే ఉండవచ్చు
కంటి అంచుపై ఒక తడి
ఉండే ఉండవచ్చు
గుండె గోడల వెంట ఒక తడి
ఉండే ఉండవచ్చు
శిల్పం శిథిలమై ...

ఉండే ఉండవచ్చు
సాలెపురుగు తనగూటిలో చిక్కుకొని
ఉండే ఉండవచ్చు
ఇంటి ముందు రెక్కలు విరిగిన సీతాకోకచిలుక
ఉండే ఉండవచ్చు
కళ్ళున్నా కబోదిలా
ఉండే ఉండవచ్చు
ఏదైనా ఎక్కడైనా ఎలాగైనా...

- లక్ష్మీ కందిమళ్ళ