Oct 17,2022 08:01

రాబందుల ఏలుబడిలో
న్యాయమా నీవెక్కడీ
సమన్యాయం.. సమధర్మం, రాజ్యాంగం రాజనీతి !
ఏది న్యాయం.. ఏది ధర్మం
ఎక్కడుంది ప్రజాన్యాయం?
జనం కోసం మాట్లాడితే ఉపా చట్టం ఉరకలేస్తది
దగా పాలనను ప్రశ్నిస్తే రాజద్రోహం రంకెలేస్తది!
బడాబాబులు హత్య చేస్తే
పట్టపగలే రేప్‌ చేస్తే
న్యాయదేవత నిద్రలేచి బోరుబోరున ఏడ్చుకుంటూ
కళ్ళ గంతలు కట్టుకుంటూ
ఆదివారం అర్ధరాత్రి బెయిలు రెడీ
జైలు బైట... న్యాయదేవత సిద్ధం
ఎంత గొప్పని ప్రజాస్వామ్యం ..
ఏలినోళ్లకు సదా గులాం!
ఎంతకాలం..ఎంతకాలం! ఇంకెంత కాలం?
కింద కోర్టు క్లీన్‌ చిట్‌ పైన కోర్టు రద్దు చేసే
నీతిమాలిన న్యాయం!

చీకటుంది... వేకువుంది
కాల గమనంలో రాక తప్పదు
వెలుతురు... గెలుపు తప్పదు!
రాజ్యమా... ఎదురు చూడు
నిగనిగలాడుతూ ఒకరోజున
తూర్పు దిక్కున పొద్దుపొడుపై
సమన్యాయం ప్రభవిస్తుంది!

- రెడ్డి శంకరరావు
94943 33511