Oct 17,2022 07:46

అతను పొద్దున్నే సెల్‌ఫోన్‌లో నిద్ర లేచి
(ముఖం లేని పుస్తకం గాని)
ముఖపుస్తకంలో ముఖం చూసుకొని
వాట్సాప్‌లో వార్తాఫలాలు చూసుకొని
మెసెంజర్‌ మెస్‌లో లంచ్‌ ముగించి
జీమెయిల్‌లో సుఖప్రయాణం చేసి
గూగుల్‌ గూట్లో కాసేపు కునుకు తీసి
యూట్యూబ్‌లో సాయంత్రం వాహ్యాళికి వెళ్లి
ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌స్టాంట్‌ కాఫీ సేవించి
ట్విట్టర్‌ చిరుకూతలాలించి
రాత్రికి
లాప్‌టాప్‌ ఒడిలో హాయిగా నిద్రపోయాడు !
 

- పాపినేని శివశంకర్‌