Sep 17,2022 09:14

క్షణికావేశానికి లోను కాకు
కొనితెచ్చు నాపదలు
దూరదృష్టితో ముందుకేగు
దరిచేరవు ముప్పులు

మాయోపాయముల పన్నకు
ప్రాణాపాయము కలిగించు
నిత్యం నిజం పలికిన
నిరంతరం నేను రక్షించు

దురాలోచనలు చేయకు
దహించును కార్చిచ్చుల
దురలవాట్లకు లోను కాకు
హరించును నిప్పుల

అవాంతరాలకు అదిరిపడకు
గాలిలో మేడలు కట్టకు
పగటి కలలతో కాలం గడపకు
ఈ ఆణిముత్యపు పలుకులా చరించిన
వెలిగెదవు మాణిక్యమై జగతిన ...

- జక్కల శివ
70932 25602