Jul 27,2022 07:38

ఆందోళనలో ఆర్థిక రథ చక్రం
దిగజారుతున్న రూపాయి విలువలు
రోజురోజుకు క్షీణిస్తున్న రూపాయి
సామాన్యుడు బక్కచిక్కి పోతున్న వైనం..

పాతాళానికి చూస్తున్న రూపాయి
డాలర్‌ తో పోటీలో నిలువలేక పతనమయ్యే
ద్రవ్యోల్బణ మంటలు ఒకవైపు
పన్నుల పోటుల తూటాలు మరోవైపు..

అధిక ధరల భారం క్షణక్షణం పెరిగే
అదుపు లేని ధరలు ఆకాశం వైపు చూసే
రూపాయి మారకంలో కోతలు పెరిగే
ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై కూర్చుండే..

సామాన్యుడి జీవితం దుర్భరమయ్యే
దిగజారుతున్న బతుకు చిత్రాల రూపం
ఆర్థిక స్థితిగతులు చిన్నాభిన్నం
ఆకలి కేకల ఢమరుక నాదాలు మిన్నంటే..

జిఎస్టి బాదుడు మధ్యతరగతి రోదనలు
ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది
ఆర్థిక నేరగాళ్లు అంచలంచెలుగా ఎదిగి
సామాన్యుడి బతుకులో ద్రవ్యం దూరం చేసిరి...

పతనమైతున్న రూపాయి పరమార్ధం ఏమిటో
బతుకు జట్కాబండిలో రూపాయి చక్రం తిప్పలు
అత్యల్ప స్థాయిలో తిరుగుతున్న ఆర్థిక బండి
మార్కెట్‌ మాయాజాలంలో సామాన్యుడు
అంగడి సరుకు.
 

- కొప్పుల ప్రసాద్‌,
సెల్‌ : 9885066235